మహాకవి అందెశ్రీ – పేదరికం నుంచి ప్రపంచ కవిత్వ శిఖరాలకు చేరిన తెలంగాణ గర్వకవి

అందెశ్రీ బడిలో చదవలేక పోయిన
పేద బిడ్డ. పశువుల కాసాడు. సుతారి పని చేసాడు. నిజామాబాద్ లో శంకర్ గురూజీ జ్ఞాన బోధ చేసాడు. బిరుదు రామ రాజు కన్న బిడ్డగా చూసుకున్నాడు. బాసర వాక్కులమ్మ స్పూర్తితో ఎదిగాడు. కాల మహిమ అందె శ్రీ ని ఆశు కవిగా పిలిచింది. లోక కవిగా ఎదిగాడు. తెలంగాణ ఉద్యమ కవిగా విశ్వ వ్యాప్తమయ్యాడు. రాష్ట్ర గీతం కవిగా నిలిచాడు. మహాకవి కాళిదాసు ను మించిన మహాకవి అనిపించుకున్నాడు.
కాళిదాసుది మేఘ సందేశం. అందెశ్రీది నది సందేశం. నది నడిచి పోతున్నది. నావనై నను కమిమన్నది అంటూ దేశ దేశాల ను సందర్శించి ప్రపంచ నదులెన్నో చూసి పరవశించాడు. కవిత్వం కోసం ప్రపంచంలోని నదుల వెంట నడిచిన కవి ప్రపంచంలో అందెశ్రీ ఒక్కడే! అత్యంత పేదరికం నుండి ఆశు కవిగా లోక కవిగా సహజ కవిగా ప్రకృతి కవిగా పరిణతి చెందిన మహాకవి.

Related Articles