తెలంగాణ ప్రజల ఆకాంక్ష – ప్రజా నాయకులకు క్యాబినెట్‌లో స్థానం కల్పించాలి

తెలంగాణ ప్రజల ఆకాంక్ష – ప్రజా నాయకులకు క్యాబినెట్‌లో స్థానం కల్పించాలి ముగ్గురు బీసీ ఆడబిడ్డలకు రాజకీ అవకాశాలు ఇచ్చిన రేవంతన్నకు జేజేలు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న బీసీ ప్రభుత్వం రేవంతన్న ప్రభుత్వానికి జేజేలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం మరింత బలోపేతమై, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఘన విజయం సాధించి అధికారంలోకి రావాలంటే ప్రజలతో మమేకమై పనిచేస్తున్న, అన్ని వర్గాల ఆదరణ కలిగిన ప్రజా నాయకులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బహుజన వర్గాల బిడ్డలు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తమదైన పాత్ర పోషించిన వారు, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న నాయకులు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కుడిభుజంగా నిలిచే ప్రజా ప్రతినిధులకు రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రింది ముగ్గురు ప్రజా నాయకులను వెంటనే తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్‌లోకి తీసుకోవాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాము: 1. ప్రభుత్వ విప్ శ్రీ అద్దంకి దయాకర్ అన్న గారు బహుజన వర్గాల గొంతుకగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న నాయకుడిగా విశేష గుర్తింపు పొందారు. 2. జూబ్లీహిల్స్ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ నవీన్ యాదవ్ గారు యువ నాయకుడిగా, బీసీ బిడ్డగా, ప్రజలతో సన్నిహితంగా ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న నాయకుడు. 3. శ్రీ ఫిరోజ్ ఖాన్ గారు భారతదేశ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, సెక్యులర్ మరియు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్న ప్రజా నాయకుడు, ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. ఈ ముగ్గురు నాయకులకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో తగిన స్థానం కల్పించడం ద్వారా రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి ముగింపు పలికి, కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరుతున్నాము. తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలను, తెలుగు ప్రజల అభిప్రాయాలను, భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానుల ఆశయాలను మరియు ప్రజాస్వామ్యవాదుల మనోభావాలను గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మా సవినయ విజ్ఞప్తి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అన్న గారికి మా వినమ్ర విజ్ఞప్తి ఏమనగా— ప్రజల ఆదరణ, సామాజిక సమతుల్యత, బహుజన వర్గాల ప్రాతినిధ్యం మరియు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు బలోపేతాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీ అద్దంకి దయాకర్ గారు, శ్రీ నవీన్ యాదవ్ గారు మరియు శ్రీ ఫిరోజ్ ఖాన్ గారికి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్‌లో సముచిత స్థానం కల్పించాలని కోరుతున్నాము. ప్రజా ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలంటే ప్రజల మనసుల్లో ఉన్న నాయకులకు ప్రభుత్వంలో తగిన స్థానం కల్పించాలి. అదే తెలంగాణ ప్రజల ఆకాంక్ష. ✊ ప్రజా నాయకులకు న్యాయం చేయాలి ✊ బహుజన వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి ✊ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలి ✊ రేవంత్ అన్న నాయకత్వాన్ని మరింత శక్తివంతం చేయాలి జై తెలంగాణ! జై కాంగ్రెస్! జై ప్రజాస్వామ్యం! రేవంత్ రెడ్డి గారి ప్రజా ప్రభుత్వం సామాజిక న్యాయానికి అసలు సిసలైన నిర్వచనం గద్వాల్ విజయలక్ష్మి గారికి నేరెళ్ల శారద గారికి గుండు సుధారాణి గారికి కీలకమైన పదవులు అప్పజెప్పి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం సామాజిక న్యాయానికి ముఖ్యంగా బీసీలకు మహిళా ఆడబిడ్డలకు పెద్దపీట వేస్తుందని చెప్పి మరొక మారు నిరూపించిన ప్రజా బాంధవుడు ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నకు తెలంగాణ సమాజం మొత్తం బ్రహ్మరథం పడుతుంది బ్రహ్మరథం పడుతుంది సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ సిహెచ్ భద్ర డిమాండ్

Related Articles